ఏఓబీలో 6,050 లీటర్ల ఊట ధ్వంసం
● 100 లీటర్ల సారా స్వాధీనం
పార్వతీపురం రూరల్: భామిని సరిహద్దు ఒడిశా గ్రామాల్లో బుధవారం ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది ఉమ్మడిగా దాడులు చేశారు. ఈ సందర్భంగా మంగళగూడలో 2200 లీటర్లు, కొత్తగూడలో 2000 లీటర్లు, నడిమిగూడలో 1850 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే మంగళగూడలో 100 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పాలకొండ, రాజాం, చీపురుపల్లి, ఆమదాలవలస, కొత్తూరు, పొందూరు ఎస్‌హెచ్‌ఓలు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.


