జాతీయస్థాయి పోటీలకు జీసీఎస్‌ఆర్ విద్యార్థి
రాజాం సిటీ: ఈ నెల 5 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు స్థానిక జీసీఎస్‌ఆర్ కళాశాల విద్యార్థి టొంపల జగదీష్‌కుమార్ ఎంపికయ్యాడని పీడీ సీహెచ్ కేశవనారాయణ బుధవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో అండర్–19 విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచాడన్నారు. విద్యార్థి జాతీయస్థాయికి ఎంపిక కావడంపట్ల ప్రిన్సిపాల్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రవీంద్రకుమార్, అధ్యాపకులు అభినందించారు.
జీఆర్పీ అదుపులో రైళ్లలో చోరీల నిందితుడు
విజయనగరం క్రైమ్: వెళ్తున్న రైళ్లల్లో నేరాలకు పాల్పడే నిందితుడిని విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉంటున్న పుల్లేటికుర్తి వంశీ(25)ట్రైన్లలోను, రైల్వే ఫ్లాట్‌ఫారాల వద్ద ప్రయాణికుల నుంచి దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువగల 8 మొబైల్ ఫోన్ల అపహరణ కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశపెట్టామని ఎస్సై బాలాజీ రావు తెలిపారు.
పోలమాంబ జాతరలో
వస్తువులకు వేలం పాట
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ బోర్డ్ చైర్మన్ లైలా తిరుపతిరావు, కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేలపాట నిర్వహించారు. చీరలు, రవికలకు 2025–2026 సంవత్సరానికి 4,40,000 ఆదాయం వచ్చింది. కొబ్బరి ముక్కల నిమిత్తం ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలు, తలనీలా ల నిమిత్తం 3,42,000 వచ్చింది. అమ్మవారి లామినేషన్ ఫొటోలు, వనం గుడి వద్ద దీపాలు పెట్టుకునే హక్కు కోసం పాట దారులు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తనిఖీదారు ఎన్.రాజకుమారి, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు. వెంకటరమణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
కొత్తవలస: బతుకు తెరువు కోసం చేసిన అప్పులను తిరిగి చెల్లించలేక మనస్తాపానికి లోనైన మండలంలోని సబ్బవరం రోడ్డులో గల శివాజీనగర్‌కు చెందిన ఎస్.సూరిబాబు (71) రైలుకింద పడి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరిబాబు కొత్తవలస మండలంలోని రెండు బ్యాంకుల్లో సుమారు రూ.4లక్షలకు పైగా రుణాలు తీసుకుని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులతో
మరో వ్యక్తి
సీతంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక సీతంపేట మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన సవర చంద్రరావు(36) అనే గిరిజనుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రరావు మానసిక అనారోగ్యం బాగులేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గతనెల 30న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రరావును మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేయగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమ్మన్నరావు తెలిపారు. మృతునికి బార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
జాతీయస్థాయి పోటీలకు జీసీఎస్‌ఆర్ విద్యార్థి
జాతీయస్థాయి పోటీలకు జీసీఎస్‌ఆర్ విద్యార్థి


