జాతీయస్థాయి కరాటే పోటీలకు జిందాల్ విద్యార్థి
కొత్తవలస: జాతీయస్థాయిలో న్యూఢిల్లీలో ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న కరాటే పోటీలకు మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల ఓపీ జిందాల్ పాఠశాలకు చెందిన విద్యార్థి అడ్డూరి యోగికార్తీక్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పీవీఎస్‌ఎస్.విశ్వనాథం బుధవారం తెలిపారు. నవంబర్ 24,25 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–14 విభాగంలో యోగికార్తీక్ ప్రథమ స్థానం సాదించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన చెప్పారు. కోచ్ సూరిబాబు శిక్షణలో యోగికార్తీక్ తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఆరవ తరగతి చదువుతున్న ఈ.దేవకీలత రెండోస్థానంలో నిలిచి సిల్వర్ పతకం సాధించిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు వి ద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల పీడీ అప్పలనాయుడు పాల్గొన్నారు.


