పోరాట యోధుడు బిర్సాముండా
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: గిరిజన హక్కుల కోసం ఆంగ్లేయులతో పోరాడిన గొప్ప యోధుడు బిర్సాముండా అని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. శనివారం స్థానిక గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజం కోసం నిస్వార్థమైన సేవతో పాటు, పోరాటం చేసిన మహానుభావుడు బిర్సాముండా అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లు దొర, అల్లూరి సీతారామరాజు, తదితరులు గిరిజన స్వాతంత్య్రోద్యమకారులుగా గుర్తింపబడ్డారన్నారు. చెంచులలో కూడా కొడిమల బయన్న, హనుమంతప్ప అటవీ ప్రాంతంలో ఉండి ఆంగ్లేయులతో పోరాడినట్లు ఇటీవల గుర్తించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబుల్ వెల్ఫేర్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలు తేజోవతి మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగఫలం కారణంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. అటువంటి స్వాతంత్య్ర పోరాటంలో బిర్సాముండా ఉండడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్, తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ మురళీధర్, కృష్ణబాబు, ట్రైకార్ సభ్యులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన నేతలను అవమానించారు..
ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతీయ గౌరవ దివస్, బిర్సాముండా జయంతి వేడుకల్లో గిరిజన సంఘాల నాయకులకు అవమానం జరిగింది. రెండు రోజుల ముందుగా ఆహ్వానించి తీరా సమావేశంలో కనీసం కూర్చోవడానికి కుర్చీ వేయలదేని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అధికారుల తీరు బాగోలేదని గిరిజన సంఘాల నాయకులు బిడ్డిక తమ్మయ్య, ఇంటికుప్పల రామకృష్ణ, పల్లా సురేష్, పాలక గౌరమ్మ, ఆరిక చంద్రశేఖర్, తదితరులు ఆరోపించారు.
పోరాట యోధుడు బిర్సాముండా
పోరాట యోధుడు బిర్సాముండా


