ఆరిపోయిన ఆశా జ్యోతి
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఆలయాలన్నీ శనివారం కార్తిక ఏకాదశి సందర్భంగా భక్తులతో సందడిగా మారాయి. పుణ్యనదుల్లో స్నానాలు చేసి ఇష్టదేవుళ్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని వేంకటేశ్వరస్వామి, రామతీర్థంలోని రాములోరి ఆలయాల వద్ద వేకువజామునుంచే భక్తులు బారులు తీరారు. – గరుగుబిల్లి/నెల్లిమర్ల రూరల్/రాజాం/బొబ్బిలి
తండ్రిమరణాన్ని దిగమింగుకుని...
మృతురాలికి అక్క, చెల్లితో పాటు సోదరుడు ఉన్నారు. అక్క భారతి ఇటీవల స్పోర్ట్స్‌కోటాలో పార్వతీపురం మన్యం జిల్లాలో పీడీగా ఉద్యోగం సాధించగా మృతురాలు కూడా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో టీటీగా కొన్నినెలల కిందటే విధుల్లో చేరింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పోటీలకు సాధన చేస్తోంది. ఆమె తల్లి యశోద ఏడాదిన్నర కిందట మరణించగా, తండ్రి భాస్కరరావు 11 రోజుల కిందట చనిపోయారు. తండ్రి మరణాన్ని దిగమింగుకుని సత్యజ్యోతి రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమైంది. కొండవెలగాడలో జరుగుతున్న పోటీల్లో ఆదివారం తలపడాల్సి ఉంది. ఒకసారి పోటీలను చూసి వద్దామని అక్కతో బయలుదేరి మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. ప్రమాదంలో సత్యజ్యోతితో కలిసి ప్రయాణిస్తున్న భారతి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. క్రీడాకారిణి మృతితో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు, క్రీడాధికారులు విషాదంలో మునిగిపోయారు.
విజయనగరం క్రైమ్: వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆమెకు ప్రాణం. చిన్నప్పటి నుంచి అక్క భారతితో కలిసి సత్యజ్యోతి(26)కఠోర సాధన చేస్తూ బరువులు ఎత్తడంలో పట్టుసాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 11 బంగారు పతకాలు సాధించింది. ఆ క్రమంలోనే నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకమే ప్రధానంగా తలపడేందుకు సిద్ధమైంది. ప్లస్ 86 కిలోల సీనియర్ కేటగిరీలో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. ఇందులో భాగంగా పోటీలను తిలకించేందుకు అక్కతో కలిసి విజయనగరంలోని బాబామెట్టలోని ఇంటి నుంచి శనివారం రాత్రి బయలుదేరింది. వైఎస్సార్ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణమూర్తి, కానిస్టేబుల్ త్రినాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి సత్యజ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టిప్పర్ ఢీకొని జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టర్ సత్యజ్యోతి మృతి
కొండవెలగాడ వెళ్తుండగా ప్రమాదం
వైఎస్సార్ కూడలి వద్ద వెయిట్‌లిఫ్టర్ సత్యజ్యోతిని ఢీకొట్టిన టిప్పర్
ఆరిపోయిన ఆశా జ్యోతి


