చెస్ పోటీల్లో రాణించిన విద్యుత్ ఉద్యోగులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన ఇంటర్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల చెస్ పోటీల్లో విజయనగరం ఆపరేషన్ సర్కిల్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఉద్యోగులు సత్తా చాటారు. ఈ నెల 11,12,13 తేదీల్లో విజయవాడలో జరిగిన పోటీల్లో టీమ్ ఈవెంట్‌లో విజయనగరం ఉద్యోగులు ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. అలాగే సింగిల్స్ విభాగంలో ఎస్. విజయ్‌కుమార్ రెండో స్థానం దక్కించుకోవడంతో పాటు త్వరలో లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు ఎ.రామకృష్ణ, ఎస్.విజయ్‌కుమార్, ఎస్.శివ ప్రసాద్, ఎస్.సత్యనారాయణ, చంద్రశేఖర్, పి.పైడిరాజులను ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రతినిధులు పి.త్రినాథరావు, ఎస్.అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ, మోహన్‌బాబు, జి.అప్పలసూరి, తదితరులు శనివారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో అభినందించారు.


