
నేషనల్ యూనివర్సిటీ గేమ్స్‌కు లావణ్య
చీపురుపల్లి: సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం (బీకాం) చదువుతున్న డి.లావణ్య ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన లావణ్యను సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ గేమ్స్‌కు ఎంపిక చేశారు. దీంతో లావణ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్‌కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, సిబ్బంది అభినందించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది పోస్టులకు గాను 250 మంది హాజరుకాగా..ఆస్పత్రి ఆఫీస్ సూపరింటిండెంట్ నారాయణరావు, ఇతర సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు.

నేషనల్ యూనివర్సిటీ గేమ్స్‌కు లావణ్య