
ఆల్‌టర్న్ వెహికల్‌పై పీఓ
మన్యం అందాలను అందరికీ చూపించేలా సీతంపేట ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్ పార్కును బుధవారం సందర్శించారు. ఆల్‌టర్న్ వెహికల్ డ్రైవింగ్ చేశారు.
సైక్లింగ్, బోటుషికారు, హ్యాంగింగ్ బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సతీష్ పాల్గొన్నారు. – సీతంపేట ఆల్‌టర్న్ వెహికల్‌పై పీఓ