
●మీమేమి తప్పుచేశాం ‘బాబు’..
వీరంతా పార్వతీపురం మన్యం జిల్లాలోని అర్చకులు. దూపదీప నైవేద్యం పథకం (డీడీఎన్‌ఎస్) కింద నెలకు రూ.10 వేల సాయం పొందుతున్న బ్రాహ్మణులు. జిల్లాలో 206 మంది ఉన్నా రు. ప్రభుత్వం అందిస్తున్న సాయంలో రూ.3 వేలు దూపదీప నైవేద్యాల కిందే ఖర్చయిపోతోంది. మిగిలేది రూ.7 వేలు భత్యమే. ఈ పథకంలో ఉన్న కారణంగా ఏ ఒక్కరికీ.. తమ పిల్లలకు సంబంధించి తల్లికి వందనం నిధులు జమ కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు అమ్మ ఒడి పథకం కింద ఏటా డబ్బులొచ్చేవని.. పిల్లల చదువు ఖర్చులకు ఉపయోగపడేవని చెబుతున్నారు. ప్రస్తుతం తమకు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.