
అన్నిశాఖల సమన్వయంతో శాంతిభద్రతల పరిరక్షణ
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు అన్నిశాఖల సమన్వయం అవసరమని విశాఖరేంజ్ డీఐజీ గోపినాథ్‌జెట్టి అన్నారు. పార్వతీపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి నేతృత్వంలో శనివారం అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఐజీతో పాటు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు పాల్గొని నేరసమీక్ష చేశారు. ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన నేరాలు, నేర నియంత్రణ చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటుచేయాలని సూచించారు. విద్య, వైద్య, సీ్త్ర, శిశు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం వన్‌స్టాప్ సెంటర్ సేవల వివరాలతో కూడిన గోడపత్రికను డీఐజీ సమక్షంలో ఆవిష్కరించారు.
సమావేశంలో ఏఎస్పీ అంకితా సురాన, డీఎఫ్‌ఓ ప్రసూన, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఈఓ రాజ్‌కుమార్, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామన్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ రంగనాథం, సైబర్‌సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి

అన్నిశాఖల సమన్వయంతో శాంతిభద్రతల పరిరక్షణ