
● పోలీసుల ‘మొక్క’వోని దీక్ష
పర్యావరణ పరిరక్షణలో పోలీసులు భాగస్వాములయ్యారు. చింతవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో శనివారం వనమహోత్సవం నిర్వహించారు. బెటాలియన్ ఆవరణలో ‘జగమంతా వనం–ఆరోగ్యంతో మనం’ పేరిట బెటాలియన్ కమాండెంట్ మలికా గార్గ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహికంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బెటాలియన్
అదనపు కమాండెంట్ సి.రాజారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుందన్నారు. – డెంకాడ