తీర్మానాలకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

తీర్మానాలకు చెక్‌!

Jul 20 2025 5:39 AM | Updated on Jul 20 2025 5:39 AM

తీర్మ

తీర్మానాలకు చెక్‌!

ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
పంచాయతీ పనులకు స్కెచ్‌..
వంట కార్మికుల తొలగింపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ల అనుమతి అనవసరం

స్థానిక టీడీపీ నాయకుల నిర్ణయమే ఫైనల్‌

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రహదారులు, గోకులాల పనులు

మండలాధికారులకు అనధికార ఆదేశాలు

సాక్షి, పార్వతీపురం మన్యం: ఏ పంచాయతీ సర్పంచ్‌ అయినా తమ ప్రాంత అభివృద్ధినే కోరుకుంటారు. పార్టీలపరంగా రాజకీయాలు ఉంటాయేమో గానీ.. తమ ఊరికి మంచి జరుగుతుందంటే.. ముందుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. పంచాయతీల్లో పెత్తనమంతా టీడీపీ వారికే అనధికారికంగా కట్టబెడుతున్నారు. వాస్తవానికి ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా.. పంచాయతీ తీర్మానం ఉండాలి. దాదాపు మెజారిటీ పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఉన్నవే. ఇక్కడే అధికార పార్టీ నాయకులకు మండుతోంది. వారి ప్రాబల్యం లేకుండా చేయాలి.. అదే సందర్భంలో టీడీపీ ఛోటా నాయకుల విలువ పెరగాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ తీర్మానాలు లేకుండానే.. కనీసం సర్పంచ్‌కు తెలియజేయకుండానే పనులకు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. పనుల కాంట్రాక్టులు కూడా ‘తమ్ముళ్ల’కే అప్పగిస్తున్నారు. గతంలో మంజూరైన గోకులం షెడ్లు, ఇతర రహదారుల పనుల విషయంలో ఇదే చోటుచేసుకుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయి. గోకులాలు నిర్మించకుండానే, చేపట్టినట్లు రాసేసి బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ విషయమై సర్పంచ్‌లు గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూటమి నాయకులు బెదర లేదు. జిల్లా అధికారులు సైతం వారు చెప్పిందే వేదమన్నట్లు తలాడిస్తున్నారన్న విమర్శలున్నాయి.

మరోసారి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు మంజూరయ్యాయి. ఈ పనులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూటమి నాయకులు స్కెచ్‌ వేస్తున్నారు. దీనికి పంచాయతీ తీర్మానాలు కావాల్సి ఉండగా.. మండల అధికారులనే సంతకాలు పెట్టి ఇచ్చేయాలని కూటమి ప్రజాప్రతినిధుల నుంచి అనధికార ఆదేశాలు అందుతున్నాయి.

● సాలూరు నియోజకవర్గంలో ఒక్కో మండలానికీ రూ.20 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రహదారి పనుల కోసం, 100 గోకులాల నిర్మాణా నికి మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 110 పంచాయతీల్లో శనివారం గ్రామ సభలు నిర్వహించాలని.. ప్రతి పంచాయతీలోనూ అందరి సంతకాలతో తీర్మానాలు చేసి, మినిట్‌ బుక్‌లో నమోదు చేయాలని ఆదేశాలందాయి. వైఎస్సార్‌సీపీ స్థానాల్లో సర్పంచ్‌ల మాటతో సంబంధం లేదని.. తీర్మానం చేసినట్లు సంతకాలు పెట్టి ఇవ్వాలని మండల అధికారులకు ఆదేశాలందాయని తెలిసింది.

● వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌లు ఉన్న పంచాయతీలు వేటికీ గ్రామ సభల సమాచారం అందించలేదు. కేవలం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌ రహిత పంచాయతీల కోసం తీర్మానం చేద్దామని మాత్రమే పిలుపునిచ్చారు. మక్కువ మండలంలో 21 పంచాయతీలుండగా.. ఇందులో టీడీపీ 2, బీజేపీ ఒకటి కాగా.. మిగిలిన 18 వైఎస్సార్‌సీపీ స్థానాలు. శనివారం గ్రామ సభలు పెట్టినా వైఎస్సార్‌సీపీ 18 పంచాయతీలతోపాటు, బీజేపీ ఒక పంచాయతీ సర్పంచ్‌లు హాజరు కాలేదు. దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది.

● చట్టబద్ధంగా తమను ఆహ్వానించి, ఏ పనులు అవసరమో చర్చిస్తే, ప్రాధాన్యాన్ని బట్టి తామే తీర్మానం చేసి ఇస్తామని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు అంటున్నారు. కొన్నిచోట్ల గతంలో చేసిన తీర్మానాలకు ఆమోదం తెలిపారు. రాజకీయ కక్షతో తమను దూరం పెట్టి, తిరిగి గ్రామాభివృద్ధికి తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు. తమతో సంబంధం లేకుండా వారికి నచ్చినట్లు పనులు చేసుకుని.. టీడీపీ కార్యకర్తలకే గోకులం షెడ్లు మంజూరు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

న్యూస్‌రీల్‌

మరోసారి అదే ప్రణాళిక..

తీర్మానాలకు చెక్‌! 1
1/2

తీర్మానాలకు చెక్‌!

తీర్మానాలకు చెక్‌! 2
2/2

తీర్మానాలకు చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement