లయాపనా! | - | Sakshi
Sakshi News home page

లయాపనా!

Jul 18 2025 1:19 PM | Updated on Jul 18 2025 1:19 PM

లయాపన

లయాపనా!

లక్షేపమా..

గిరిజనుల నుంచి అభిప్రాయ సేకరణ అని చెప్పి.. సమావేశానికి గిరిజనేతరులనూ ఆహ్వానించడంపై తొలుత విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై గిరిజన సంఘాల నాయకులు అధికారులను నిలదీశారు. జీవోను నీరుగార్చే ఉద్దేశంతోనే అందరినీ పిలిచారంటూ పలువురు విమర్శించారు. దీంతో సమావేశ మందిరంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. అనంతరం కొంతమంది అభిప్రాయాలను మాత్రమే సేకరించారు. సీతంపేట తదితర ప్రాంతాల నుంచి సంఘాల నాయకులు మాట్లాడేందుకు వచ్చినా వారికి అవకాశం ఇవ్వలేదు. చాలామందికి వినతిపత్రం అందిస్తే పరిశీలిస్తామని చెప్పి, సరిపెట్టేశారు.

● చట్ట పరిధిలో గిరిజనులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు నిమ్మక జయరాజు తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా రద్దు చేసిన జీవోలోని అంశాలు అనుకూలంగా ఉండాలంటే రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గమన్నారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ మేరకు మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు.

● చట్టాలు అమలు కాని పరిస్థితి ఉందని మాజీ శాసనసభ్యులు కోలక లక్ష్మణమూర్తి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో వంద మంది ఉద్యోగాలు చేస్తే.. అందులో 96 మంది గిరిజనేతరులే ఉంటున్నారని తెలిపారు. ఇంకా సమానత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని తెలిపారు. సమ సమాజంలో గిరిజనులకు సమానత్వం కల్పించాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణ కావడం లేదన్నారు.

● ఐదవ షెడ్యూల్‌లో ఉన్న తమను ఆరో షెడ్యూల్‌కు పంపేలా కేంద్రానికి ప్రభుత్వం సిఫారసు చేయాలని, అప్పుడే గిరిజనులకు తగిన న్యాయం జరుగుతుందని కురుపాం మండలం లంకజోడి గ్రామ సర్పంచ్‌ ఆరిక విప్లవ కుమార్‌ కోరారు.

● గిరిజన ప్రాంతాల్లో జిల్లా యూనిట్‌గా తీసుకొని వంద శాతం గిరిజనులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. గిరిజన భాషను నేర్చుకున్న వారినే ఉపాధ్యాయులుగా నియామకం చేపట్టాలని గిరిజన ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు గేదెల రామకృష్ణారావు కోరారు.

● రద్దు చేసిన జీవో పక్కాగా అమలు కావాలంటే సవరణ ఒక్కటే మార్గమని గుమ్మలక్ష్మీపురం మండలం చింతలగూడ సర్పంచ్‌ నిమ్మక సింహాచలం తెలిపారు.

● జీవో 3 పునరుద్ధరణ జరగదని, ప్రత్యామ్నాయం కావాలని మొత్తంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జీవోలను మార్చేస్తున్నారని చెప్పారు. జీవోలు వద్దు.. చట్టం కావాలని స్పష్టం చేశారు. అప్పుడే మార్చడానికి వీలుండదన్నారు. గిరిజనుల పక్షాన ప్రభుత్వాలు, ఐటీడీఏ అధికారులు పోరాడాలని కోరారు.

● రాజ్యాంగ సవరణ చేసైనా షెడ్యూల్డ్‌ ఏరియా ఉద్యోగాలన్నీ గిరిజనులకు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాడంగి సాయిబాబు, పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ భార్గవికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు జీవో నంబర్‌–3 సక్రమంగా అమలు కాలేదన్నారు. జీవోలు కాకుండా చట్టం తేవాలని కోరారు. అభిప్రాయ సేకరణ కాలక్షేపం, కాలయాపన చేస్తే పోరాటం తప్పదని స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందే గిరిజన సంఘాల అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు.

● షెడ్యూల్డ్‌ ఏరియాలో జీవో 3 స్థానంలో వంద శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక రిజర్వేషన్‌ చట్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజాసంఘాలు కోరాయి. మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఐటీడీఏ వద్ద ఆయా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

గిరిజనేతరులకు ఏం పని?

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: జీవో నంబర్‌–3ను పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు.. గెలిచాక మాట దాటేశారు. ఏడాదికిపైగా కాలక్షేపం చేసి.. ఇప్పుడు తీరిగ్గా కాలయాపనకు సిద్ధమయ్యారు. జీవో అమల్లో ఇబ్బందులంటూ చెప్పుకొస్తూ.. ప్రత్యామ్నాయ జీవో అంటూ గిరిజనులను ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. జీవో నంబర్‌– 3, గిరిజన చట్టాలపై అభిప్రాయా లు, సూచనలు, సలహాల కోసమని గురువారం పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్‌.భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ న్యాయ సలహాదారు డాక్టర్‌ పల్లా త్రినాథరావు జీవో నంబర్‌– 3ను సుప్రీంకోర్టులో ఎందుకు కొట్టి వేశారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వాస్తవానికి ఇదంతా గడిచిన అధ్యాయం. అందులో ఇబ్బందులు, గత ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్‌ చేయడం.. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి ఎరుకే. తెలిసీ ఎన్నికల ముందు సంబంధిత జీవోను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో చేసిన ప్రచారంలోనూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు మాట మార్చి, అమలు చేయకుండా ఆలస్యం చేయడం.. అభిప్రాయ సేకరణ అంటూ దాటవేయడం కాలయాపన చేయడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి నివేదిస్తాం...

జీవో నంబర్‌–3పై గిరిజనుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్‌.భార్గవి తెలిపారు. గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీవో నంబర్‌–3ను సుప్రీంకోర్టులో రద్దు చేసిన నేపథ్యంలో వివిధ సంఘాలు, న్యాయవాదులు చేసిన ఉద్యమాల ద్వారా తిరిగి పునరుద్ధరణ చేయాలని దరఖాస్తులు వచ్చాయని, దీనికి స్పందించి గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడీఏల పరిధిలో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి అభిప్రాయాలను స్వీకరించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరితో చర్చించాక మరింత మెరుగ్గా జీఓను అమలు చేసే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవ మాట్లాడారు.

జీవో నంబర్‌ 3పై అభిప్రాయ సేకరణ

తూతూమంత్రంగా నిర్వహణ

గిరిజనేతరులూ సమావేశంలోకి..

జీవో కాదు.. చట్టం చేయాల్సిందే అని స్పష్టం చేసిన గిరిజన సంఘాలు

మీడియా అవసరం లేదా.. సమాచార శాఖ అత్యుత్సాహం

జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన ఏ కార్యక్రమాలకూ మీడియాతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచార శాఖ నుంచి వారు పంపించింది రాసుకోవడమే తప్ప.. అన్ని కార్యక్రమాలనూ గోప్యంగానే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఓ వర్గం మీడియా తప్ప, ఇంకేమీ అవసరం లేదన్నట్లు జిల్లా అధికారుల వైఖరి ఉంది. అందరికీ తెలిసి జరగాల్సిన జీవో నంబరు 3 అభిప్రాయ సేకరణ కార్యక్రమంలోనూ సమాచార శాఖ అదే వైఖరి అవలంబించింది. ముఖ్యంగా ‘సాక్షి’ మీడియా పట్ల దురుసుగా వ్యహరించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సాక్షి మీడియాపై అక్కసు వెళ్లగక్కారా, లేకుంటే స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో వారికి నచ్చిన మీడియానే ఉంచి, మిగిలిన వారిని బయటకు పంపించేశారు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం విషయంలోనూ మీడియా ప్రతినిధుల పట్ల అధికారులు ఇదే మాదిరి నిర్లక్ష్యం చూపారు. ఈ అంశాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

లయాపనా! 
1
1/2

లయాపనా!

లయాపనా! 
2
2/2

లయాపనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement