
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
పాలకొండ: సమస్యలు పరిష్కరించాలంటూ నగర పంచాయతీ పరిధిలోని మన్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ్నప్రదర్శన చేపట్టారు. కనీసవేతనం చెల్లించాలని, సంక్షమే పథకాలు వర్తింపజేయాలని, గతంలో సమ్మె చేపట్టిన సందర్భలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరిస్తా
పార్వతీపురం టౌన్: ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అరకు ఎంపీ తనూజారాణి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి వైఎస్సార్‌సీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లోని సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. బెలగాం రైల్వే గేటు సమస్యను పరిష్కరించాలని డీఆర్‌ఎంకు ఫోన్‌చేసి తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బొమ్మి రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీ బి. రవికుమార్, సిద్ధా జగన్నాథం, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం రూ.2,47,455లు
చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి జూలై 16 వరకు భక్తులు హుండీలలో వేసిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,47,455ల ఆదాయం వచ్చినట్టు ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జి.శ్యామ్‌ప్రసాద్ నేతృత్వంలో సాగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గవిడి నాగరాజు, లెంక చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శుల వివరాల రిజిస్ట్రేషన్‌కు ఆదేశం
విజయనగరం అర్బన్: పీ–4 కింద పేదలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శుల వివరాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. వెబెక్స్‌లో పీ–4, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధుల వ్యాప్తి తదితర అంశాలపై జిల్లా స్థాయి, మండల అధికారులతో కలెక్టర్ బుధవారం మాట్లాడారు. పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
700 క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఏఈ నితిన్ తెలిపారు. ఇప్పటివరకు 600 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు సరఫరా చేయగా, కాలువ సామర్థ్యమేరకు తాజాగా మరో వంద క్యూసెక్కుల నీటిని పెంచామన్నారు.

మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన