
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయండి
● టిడ్కో చైర్మన్ వేములపాటి
అజయ్ కుమార్
నెల్లిమర్ల: టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని టిడ్కో రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని టిడ్కో కాలనీ సముదాయాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో కలిసి బుధవారం సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను ఆరాతీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, పట్టణాల్లో సొంతిల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బృహత్తర పథకమన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు సరోజిని, నాయకులు జనా ప్రసాద్, అప్పికొండ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
అరకొర నీటితోనే దమ్ము