
స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) వచ్చే వినతుల పట్ల సక్రమంగా స్పందించని అధికారులకు షోకాజ్ నోటీసులు అందించక తప్పదని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహించి 194 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ లాగిన్ అయి వినతులను పరిశీలించాలన్నారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందాయని చెప్పారు.
అక్రమ ఆశీలుపై ఫిర్యాదు
జామి మండలంలోని అలమండ సంతలో లైసెన్స్ లేకుండా చిరువ్యాపారుల నుంచిన అక్రమంగా ఆశీలు వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని గంట్యాడ మండలం పెదవేమలి సర్పంచ్ వర్రి పాపునాయుడు అధికారులకు వినతి అందజేశారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్