మా పొట్ట కొట్టారు
● కలెక్టరేట్ వద్ద ఎండీయూ వాహన ఆపరేటర్ల ఆందోళన ● కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● చిరుద్యోగులను తొలగిస్తున్న పాలకుల పదవులను ఊడగొడతామని హెచ్చరిక
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఎండీయూ ఆవరేటర్లు
●కూటమి నిర్ణయం సరైనది కాదు
కూటమి ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం సరైనది కాదు. పాత విధానంలోనే ఇళ్ల వద్దకు రేషన్ సరుకులు అందజేసేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 196 మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. వారికి ప్రభు త్వం భరోసా కల్పించాలి. రాష్ట్ర నాయకులతో కలి సి ప్రభుత్వంపై ఉద్యమం చేపడతాం.
– పి.మన్మథ, ఎండీయూ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు
●పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి. ప్రభు త్వం జూన్ 1 నుంచి రేషన్ వాహనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎండీయా ఆపరేటర్లు ఎంతో మంది ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి.
– ఎం.గౌరీశంకరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
●వీధిన పడ్డాం
కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో వీధినపడ్డాం. ప్రభుత్వం ఎండీ యూ వ్యవస్థపై పునరాలోచించాలి. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించాలి.
– జంజేటి ప్రసాద్, ఎండీయూ ఆపరేటర్,
పార్వతీపురం
పార్వతీపురంటౌన్:
ఎన్నికల ముందు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు... లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నమ్మించారు.. తీరా అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దుచేసి వేలాదిమందికి ఉపాధి లేకుండా చేశారు... ఎండీయూ వ్యవస్థను ఆపేసి ఆపరేటర్ల పొట్టకొట్టారు.. వివిధ శాఖల్లోని చిరుద్యోగులను తొలగిస్తున్నారు.. ఉపాధిహామీ మేట్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఫీల్డు అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు.. ఇవే వేధింపుల పరంపర కొనసాగితే పాలకుల పదవులు కూడా ఊడగొట్టేరోజు వస్తుందని ఎండీయూ ఆపరేటర్లు హెచ్చరించారు. తమకు జరిగిన అన్యాయానికి నిరసగా కలెక్టరేట్‌ను శుక్రవారం ముట్టడించారు. కూటమి ప్రభుత్వ చిరుద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. ఇంటింటికీ రేషన్ సరఫరాను జూన్ 1 నుంచి నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తమ బతుకు బండికి భరోసా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. 196 ఎండీయూ వాహనాల ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మా పొట్ట కొట్టారు
మా పొట్ట కొట్టారు
మా పొట్ట కొట్టారు


