సౌర విద్యుత్‌తో బహుళ ప్రయోజనాలు
పార్వతీపురం టౌన్: ప్రతిఒక్కరూ సౌర విద్యుత్‌ను వినియోగించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 3 కేవీ యూనిట్ ఏర్పాటుతో ఎక్కువలోడ్ విద్యుత్‌ను వినియోగించుకోవచ్చన్నారు. రూ.1.20 లక్షలు చెల్లించిన వెంటనే సంబంధిత ఏజెన్సీ సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రూ.80 వేలు రాయితీ వస్తుందని, మొత్తం రూ.2 లక్షలు యూనిట్ ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సౌర విద్యుత్‌ను తమ గృహాల్లో ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్వతీపురం విద్యుత్‌శాఖ డివిజన్‌లో ఇప్పటి వరకు 147 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేశారని, సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. అనంతరం పార్వతీపురం పట్టణంలో ఎస్‌ఎన్‌ఎం కాలనీలో పీఎం సూర్యఘర్ లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. కృష్ణమూర్తి అనే లబ్ధిదారుని ఇంటి వద్ద నమోదు కార్యక్రమాన్ని స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు.
9న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాక
పార్వతీపురం టౌన్: రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పార్వతీపురం పట్టణంలో సత్కరిస్తారని, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో చర్చించారు.
కృష్ణారాయపురానికి ఏనుగులు
సీతానగరం: గరుగుబిల్లి మండలం బురద వెంకటాపురం నుంచి సీతానగరం మండలంలోని సుమిత్రాపురం మీదుగా కృష్ణారాయపురం గ్రామానికి ఏనుగులు చేరుకున్నాయి. రామకోనేరు, శివాలయ ప్రాంతాల్లో శుక్రవారం సంచరించాయి. గ్రామంలోని అగ్రహారం వీధిలోకి ఏనుగులు రావడంతో గ్రామస్తులు పరుగుతీశారు. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై బూర్జ పొలాల్లోకి మళ్లించారు.
వ్యవసాయరంగంపై చిన్నచూపు
రేగిడి: కూటమి ప్రభుత్వం వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. రేగిడికి శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకు రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు అందకపోవడం దారుణమన్నారు. రైతు సేవా కేంద్రాలకు నేటికీ విత్తనాలు రాకపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకునే దుస్థితి నెలకుందన్నారు. చెరకు, మొక్కజొన్న పంటలకు ఎరువులు అందజేసే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్, రబీ సీజన్‌లు గడిచిపోయాయి.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చిన అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి రైతన్నకు అందలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందేవని తెలిపారు. ఆయన వెంట బీసీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు సురేష్, వెంకటేశ్వరరావు ఉన్నారు.
సౌర విద్యుత్‌తో బహుళ ప్రయోజనాలు
సౌర విద్యుత్‌తో బహుళ ప్రయోజనాలు


