
●ఏ అంశాలూ చర్చించనీయలేదు..
సమావేశమంతటినీ కూటమి ఎమ్మెల్యే, నాయకులు వారి కనుసన్నల్లోనే జరగాలని చూశారు. అజెండా లో రెండు అంశాలు వద్దని చెప్పాను. వినలేదు. సమావేశం ప్రారంభం కాగానే వివాదానికి తెర తీ శారు. కొద్దిరోజుల్లో పండగ రానుంది. నీరు, శానిటేషన్, జనరేటర్ల కోసం అజెండాలో పెట్టారు. పార్వతీపురం ప్రజల కోసం ఆ అంశాలనైనా చర్చిస్తే బాగుండేది. పోలీసులను పెట్టి, మా సభ్యులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లిపోయారు. మొన్న తహసీల్దార్ మాదిరి ఇప్పుడు నాపైనా సంతకం కోసం ఒత్తిడి చేశారు.
– బోను గౌరీశ్వరి, మున్సిపల్ చైర్‌పర్సన్