
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జియ్యమ్మవలస రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి శుక్రవారం జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి రెండు పోలీస్‌స్టేషన్‌లో దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా రు. అంతేకాకుండా గంజాయి, మత్తు పదార్థాలు యువతకు చేరవేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రహదారి భద్రత, శక్తి టీమ్‌ల నిర్వహణ, క్రైమ్ రేటు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చినమేరంగి ఎస్సై అనీష్, జియ్యమ్మవ ఎస్సై ప్రశాంత్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దాతలకు డీఎస్పీ అభినందనలు
సాలూరు: శ్యామలాంబ పండగ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 35 రోడ్డు స్టాపర్స్‌ను వితరణగా అదజేసిన నిహాల్ మల్టీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బంకురునాయుడు, డాక్టర్ దాక్షాయణి దంపతులను ఇన్‌చార్జ్ డీఎస్పీ రాంబాబు, సీఐ అప్పలనాయుడులు శుక్రవావారం అభినందించారు. అమ్మవారి పండగ కోసం తమవంతు సాయం అందించడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ అప్పలనాయుడు ఈ సందర్భంగా అన్నారు.
తిరంగా యాత్రలో మంత్రి
సాలూరు: పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమవడంతో త్రివిధ దళాలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపేందుకు నిర్వహించిన తిరంగా యాత్రలో సీ్త్ర శిశు, గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్‌వీరమణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, పలువురు అధికారులు, ఉద్యోగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కలుపు మందు నిషేధం
● అమ్మినా, వినియోగించినా చర్యలు
● వ్యవసాయ అధికారి గోవిందరావు
పాచిపెంట: గ్లైఫోసిట్ కలుపు మందు విక్రయం, వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని..షాపు యజమానులు అమ్మినా..రైతులు వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలం లోని పి.కోనవలస, పెద్ద చీపురువలస శ్యామల గౌరీపురం, చెరుకుపల్లి గ్రామాల్లో భూసారం పెంపులో భాగంగా నవధాన్యాల సాగు ఆవశ్యకతపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత వరకు కలుపు మందులకు దూరంగా ఉండాలని, గ్లైఫోసిట్ అనే కలుపుమందు సాధారణ వినియోగం విక్రయం రాష్ట్రంలో నిషేధించారన్నారు. దీనివల్ల అనేక అనర్థాలు ఉన్నాయన్నారు. జీవ వైవిధ్యం పూర్తిగా నశించిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వినోద్, నాగమణి ప్రకతి వ్యవసాయ సిబ్బంది విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
బాడంగి: వినియోగదారులకు రేషన్‌డిపోల ద్వారా పంపిణీచేస్తున్న పీడీఎస్ బియ్యం ఆటోలో అక్రమరవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఎస్‌డీటీ దారికాచి పట్టుకున్నారు. మండలంలోని ముగడ గ్రామానికి చెందిన వ్యాపారి పెద్దాడ వెంకటరమణ 6.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వినియోగదారులు, డీలర్లనుంచి కొనుగోలుచేసి సాలూరువైపు అక్రమంగా రవాణాచేస్తున్నట్లు తెలుసుకున్న సీఎస్‌డీటీ స్వర్ణలత బుధవారం సీహెచ్‌సీ–డొంకినవలస ఎత్తుకానా సమీపంలో దారికాచి పట్టుకున్నారు.

ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ఎస్పీ ఆకస్మిక తనిఖీ