
ప్రాథమిక వైద్యమే కీలకం
పార్వతీపురం రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయస్థితి నుంచి తప్పించవచ్చని ఆరోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహనరావు అన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అత్యవసర సమయంలో ప్రాథమిక వైద్యానికి అందుబాటులో ఉన్న పరికరాలు, నిర్వహణ తీరు పరిశీలించారు. ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్, ఆక్సిజన్ ఫ్లో మీటర్, అంబుబ్యాగ్, ఈసీజీ యంత్రం, సీబీసీ, యూరిన్ అలైజర్స్, అగ్నిమాపక యంత్రం, కోల్డ్ చైన్ సిస్టమ్ వంటివి పనిచేస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జి.ధరణి, జి.గోపాలకృష్ణ, ఎపిడమిక్ సత్తిబాబు, సూపర్‌వైజర్లు వెంకటనాయుడు, జయలక్ష్మి పాల్గొన్నారు.