
పార్వతీపురంలో తాగునీటి కష్టాలు
పార్వతీపురం పట్టణంలో తాగునీటి కష్టాలకు గూడ్స్‌షెడ్ రోడ్డులో మంగళవారం కనిపించిన ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పట్టణంలోని పలు ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు విడిచిపెడుతున్నారు. శివారు కాలనీల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేతలను నిలదీద్దామంటే కనిపించడంలేదని మహిళలు చెబుతున్నారు. బిందెడు నీటికోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామంటూ వాపోతున్నారు.
– పార్వతీపురం టౌన్