నూతన విద్యావిధానంలో వింత పోకడలు..! | - | Sakshi
Sakshi News home page

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!

May 4 2025 6:59 AM | Updated on May 4 2025 6:59 AM

నూతన

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!

పార్వతీపురంటౌన్‌: విద్యారంగంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతున్నాయి. విద్యావ్యవస్థ గాడి తప్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాఠశాలల విలీన ప్రక్రియ, ఉపాధ్యాయుల నియామకం, బోధన ప్రక్రియల్లో ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉన్నత పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నూతన విద్యావిధానంలో ప్రాథమికోన్నత పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం చేస్తే కొన్నిచోట్ల 6 వ తరగతి నుంచి సబ్జెట్‌ టీచర్లకు బదులు సెకెండ్‌ గ్రెడ్‌టీచర్లు చదువు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులు పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

ఇదీ పరిస్థితి...

వాస్తవంగా 6వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లే బోధించాలి. కూటమి ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలులోకి వస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు హైస్కూళ్లలో విలీనం అవుతాయి. జిల్లాలో 324 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా అందులో 10 పాఠశాలలను హైస్కూళ్లుగా మార్చారు. 80 పాఠశాలల్లో విద్యార్థులు తగినంత సంఖ్య ఉండడంతో ఎలాంటి మార్పులు చేయకుండా వాటిని అక్కడే హైస్కూల్స్‌గా ఉన్నతీకరించారు. మిగిలిన పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదివే విద్యార్థులు 60 లోపు ఉన్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. 60 మంది లోపు విద్యార్థులను కూడా సమీపంలోని హైస్కూల్స్‌లో చేర్పించాలని వారి తల్లిదండులకు ఉపాధ్యాయులతో ప్రభుత్వం చెప్పించింది. హైస్కూల్‌కు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నాయంటూ పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విలీనప్రక్రియకు అభ్యంతరం తెలిపారు.

స్కూల్‌ అసిస్టెంట్లతోనే

బోధించాలి

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరిగా స్కూల్‌ అసిస్టెంట్లతోనే బోధించాలి. అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలను తొలగించడంతో ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. హైస్కూల్స్‌ దూరంగా ఉండడం కూడా ఒక కారణం. 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఎస్జీటీలతో బోధించడం మంచిది కాదు. – ఎన్‌.బాలకృష్ణ,

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి,

పార్వతీపురం మన్యం

విలీన ప్రక్రియ ఆలోచన

విరమించుకోవాలి

ఉన్నత పాఠశాల్లో ప్రాథమిక తరగతులను విలీనం చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీలతో చదువు చెప్పించడం సమంజసం కాదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

– ఎం.మహేష్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం

విద్యాప్రమాణాలు

దెబ్బతింటాయన్న

ఆందోళన..

10 మంది విద్యార్థులున్న చోట ఇద్దరు ఎస్జీటీలు, 11–30 మంది విద్యార్థులున్నచోట ముగ్గురు, 31–40 మంది విద్యార్థులు దాటి ఉంటే ఐదుగురు ఎస్జీటీలను కేటాయించారు. 6 నుంచి 8 వరకు చదువుతున్న విద్యార్థులకు ఎస్జీటీలతో బోధన సాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. హైస్కూల్‌ విద్యార్థుల బోధనకు స్కూల్‌ అసిస్టెంట్లనే నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే అర్హత ఉన్న ఎస్జీటీలకు ఉద్యోగోన్నతి కల్పించి శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి.

గందరగోళంలో 6, 7, 8 తరగతుల విద్యార్థుల చదువు

ఎస్జీటీలతో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధన సరికాదంటున్న మేధావులు

పదోన్నతులు కల్పించాలి

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరిగా సబ్జెక్టు టీచర్సే బోధించాలి. లేదంటే ఎస్జీటీలకు శిక్షణ ఇచ్చి ఎస్‌ఏలుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. శిక్షణ ఇచ్చాక వారితో చదువు చెప్పించాలి.

– కె.భాస్కరరావు, యూటీఎఫ్‌,

జిల్లా ప్రధాన కార్యదర్శి,

పార్వతీపురం మన్యం

అశాసీ్త్రయమైన చర్య

ఒకే తరగతి విద్యార్థులకు ఎస్‌ఏలు, ఎస్జీటీలతో బోధించడం అశాసీ్త్రయమైన చర్య. ప్రభుత్వం పునరాలోచించాలి. 70 మంది కంటే తక్కవ విద్యార్థులు ఉన్నచోట ప్రధానోపాధ్యాయులు, పీఈటీ అవసరం లేదంటే పర్యవేక్షణ లోపిస్తుంది.

– ఎస్‌.మురళీమోహన్‌,

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..! 1
1/3

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..! 2
2/3

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..! 3
3/3

నూతన విద్యావిధానంలో వింత పోకడలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement