సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Mar 25 2025 1:42 AM | Updated on Mar 25 2025 1:38 AM

పార్వతీపురంటౌన్‌: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం ఆమె పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీఆర్‌ఓ కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.రామచంద్రారెడ్డిలతో కలిసి 98 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అర్జీలు రీ ఓపెన్‌ కాకుండా చర్యలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన పాలకొండ మండలానికి చెందిన సుందరగిరి శ్రీజా భవానీ తనకు టచ్‌ఫోన్‌ కావాలని ఇదివరకే వినతిపత్రాన్ని అందజేయడంతో ఆమెకు టచ్‌ఫోన్‌ అందజేశారు.

పీజీఆర్‌ఎస్‌లో అందించిన కొన్ని అర్జీలు

● జియ్యమ్మవలస మండలం గడసింగుపురం నుంచి పి. తాతబాబు తదితరులు తమ గ్రామంలోని ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పనికిరానివారి పేర్లతో అక్రమాలకు పాల్పడడమే కాకుండా ఒక్కో వేతన దారు నుంచి రూ.200 చొప్పున అవినీతికి పాల్పడుతున్నారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

● పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలో గల పొలాలకు ఆధారమైన పంటకాలువ పూర్తిగా కబ్జాకు గురైందని, ఆ కాలువ ద్వారా 200 ఎకరాల్లో సాగుభూములు, 15 చెరువులు ఆధారపడి ఉన్నాయన్నారు. కబ్జాతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు.

● కురుపాం మండలం రెల్లిగూడ గ్రామానికి గతంలో నిర్మించిన గ్రావెల్‌ రోడ్డు పూర్తిగా పాడైనందున తమ గ్రామాలకు అంబులెన్స్‌, రేషన్‌ వాహనం రావడం లేదని, రోడ్డు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్‌ బి.అరుణ గ్రామస్తులతో కలిసి అర్జీ చేశారు.

● పాలకొండ మండలం బుక్కురుపేట గ్రామానికి చెందిన సంధ్యారాణి పెండింగ్‌లో ఉన్న తన ఇంటి బిల్లును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

సమస్యలపై విచారణ చేసి న్యాయం

పార్వతీపురం రూరల్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి అలసత్వం చేయకుండా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సోమవారం వచ్చిన 13 ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, వరకట్న వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీ వసూళ్లు, ప్రేమపేరుతో మోసం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్‌ ద్వారా మాట్లాడి ఆయా సమస్యలను, వాటి పూర్వాపరాలను పరిశీలించి వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌కు 40 వినతులు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయి. పీఓ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి వినతులు స్వీకరించారు. బర్నగ్రామానికి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని ఎ.చిన్నారావు, సీసీరహదారి మంజూరు చేయాలని ఈతమానుగూడకు చెందిన రాజేష్‌ అర్జీలు అందజేశారు. మంచినీటి సదుపాయం కల్పించాలని కుశిమి బంగారుగూడ గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, ఏపీడీ సన్యాసిరావు, డీఈ మధుసూదనరావు, సీడీపీఓ రంగ

లక్ష్మి పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 98 వినతులు

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి1
1/2

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి2
2/2

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement