బాడంగి: రానున్న ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీజీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.ఆనందరావు వెల్లడించారు. మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశం స్థానిక వెలుగు మండల సమాఖ్య భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 – 26లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక తయారీ చేసేందుకు వీఏఏలు, గ్రామైక్య సంఘాల సభ్యులతో కలసి సమీక్షించారు. గత ఏడాది 259 మంది రైతులకు చెందిన 58 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేయించినట్టు తెలిపారు. ఆయనతో పాటు ఏపీఎం రత్నాకరరావు, వీఏఏలు, వీఓఏలు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.