బలిజిపేట: మండలంలోని గలావల్లిలో 850కిలోల రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై రామారావు, బలిజిపేట సీఎస్‌డీటీ రమేష్‌బాబులు మంగళవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం గలావల్లి గ్రామానికి చెందిన ఎం.రామారావు అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసి ఇంటివద్ద ఉంచాడు. దీంతో అధికారులు దాడిచేసి రామారావు ఇంటి వద్ద ఉన్న 850కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వ్యాపారి రామారావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి జంక్షన్ వద్ద బొలెరో వ్యాన్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గణేష్ మాట్లాడుతూ వాహన తనిఖీలు చేపడుతుండగా ఎటువంటి అనుమతులు లేకుండా వాహనంలో తరలిస్తున్న 60 భస్తాలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు.