చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దని..న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరంలో మైమ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వెటర్నరీ కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, స్టైపెండ్‌ను రూ.25వేలకు పెంచాలనే డిమాండ్లతో కళాశాల ఆవరణలో వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న నిరవధిక దీక్ష సోమవారానికి 42వ రోజుకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా విద్యార్థులు కొద్ది రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ నిరవధిక దీక్షలతో పాటు రోడ్డెక్కి భారీ ర్యాలీలు, నలుపు వస్త్రాలు ధరించి నిరసనలు, వంటావార్పు లాంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా సోమవారం కూడా నిరవధిక దీక్షా శిబిరంలో ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దు..న్యాయం చేయాలంటూ వివిధ వేషధారణలతో వారి బాధను మైమ్ రూపంలో ప్రదర్శించారు.
వెటర్నరీ విద్యార్థుల మైమ్ కార్యక్రమం
42వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలు