● విద్యాశాఖ ఆర్‌జేడీకి ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యుల వినతి
విజయనగరం అర్బన్: విద్యారంగంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో చేపడుతున్న విధానాల్లో లోపాలను సరిచేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చిన ఆర్‌జేడీ కె.విజయభాస్కర్‌ను శుక్రవారం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. పదోన్నతుల్లో ఎవ్వరికీ అన్యాయం జరగకూడదన్నారు. తరగతులు, మ్యాపింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఎంసీ కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసికోవాలని కోరారు. బకాయిపడి ఉన్న 50 శాతం పాఠశాల నిర్వహణ నిధులు చెల్లించాలని, గిరిశిఖర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీఎల్‌ఐ వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్‌జేసీని కలిసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.జోగారా వు, జిల్లా ప్రధాన క్యాదర్శి చిప్పాడ సూరిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మురళి, జిల్లా ఉపాధ్యాయులు టి.నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.