సీతానగరం: మండలంలోని వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి భోజన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్టేట్‌ఫుడ్ కమిటీ సభ్యుడు బి.కాంతారావు అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట, మరిపవలస వసతి గృహాలను గురువారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జోగింపేటలో ఉన్న కేజీబీవీ వసతిగృహంలో సరుకుల నిల్వల రిజిస్టర్, వంటల రుచులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పదవతరగతి విద్యార్థులకు జరుగుతున్న విద్యాబోధనను పరిశీలించారు. అనంతరం మరిపివలసలో బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.సూరిదేముడు, ప్రిన్సిపాల్స్ మధుకిశోర్, జొన్నాడ సంధ్య పాల్గొన్నారు.