రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పేద, బడుగు, అట్టడుగు వర్గాల వారు తమ హక్కులను కోల్పోతున్నారు. హక్కులపై పోరాటాలు చేసేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదలు చదువుకునే పరిస్థితి లేదు. యువతను మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారింది. నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 2014లో మోసం చేశారు. ఇప్పుడూ అదే పరిస్థితి. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై యువత తిరగబడే రోజులు వచ్చాయి.
– అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం