● జిల్లాకు రూ.73.09 కోట్ల కేటాయింపు:
కలెక్టర్
సాక్షి, పార్వతీపురం మన్యం: అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. పీఎంఏవై 1.0లో ఇల్లు మంజూరై, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయ ని వివరించారు. బుధవారం నిర్వహించిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చెందిన 10,717 గృహాలను పూర్తి చేయనున్నామన్నారు. ఇందులో బీసీ లబ్ధిదారులు 4,109మంది, ఎస్సీ 1,169, ఎస్టీ 3,073, ఎస్టీ (పీవీటీజీ) లబ్ధిదారులు 2,366 మంది ఉన్నారని ఆయన వివరించారు. జిల్లాలోని లబ్ధిదారులకు అదనంగా రూ.73,09,75,000 మేర ప్రయోజనం కలగనుందని తెలిపారు. గృహ నిర్మాణం యూనిట్ విలువ రూ.1.80 లక్షలు కాగా.. ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీ (ఆదివాసీ గిరిజనులకు) లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అదనంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులతో గృహనిర్మాణాలను 2025 ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశలనుబట్టి అదనపు మొత్తం లబ్ధిదారు ల ఖాతాకు నేరుగా జమ అవుతుందని వెల్లడించా రు. లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణ మే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
విస్తృతంగా అవగాహన
అదనపు ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. సర్వేకు వచ్చిన సచివాలయ, గృహ నిర్మాణ సంస్థ సిబ్బందికి సహ కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వే మార్చి 15 నుంచి 22వ తేదీ వరకు ఉంటుందని చెప్పారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పి.ధర్మ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.