
విజయనగరం రూరల్: ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని గురజాడ గ్రంథాలయం ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఒక విభాగం, 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు మరో విభాగంగా పోటీలు నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థులు కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ కాలుష్యం అంశాలపై నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపారు. రెండు విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 5 నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని పర్యావరణ ఇంజినీర్ టి.సుదర్శనం తెలిపారు.