న్యూస్‌రీల్
పెట్రోలు, డీజిల్ కొరత లేదు
లింకులతో జాగ్రత్త...
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
సైబర్ వలలో
కేటుగాళ్లతో జాగ్రత్త
సత్తెనపల్లి:ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శించే ప్రమాదం ఉంది. పశ్చి మాసియాలో యుద్ధం ప్రభావంతో వంట గ్యాస్ కొరత ఏర్పడ డా న్ని తమ నేరానికి పెట్టుబడిగా పెట్టుకునే ఎత్తు లు వేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ ప్రజలను బురిడీ కొట్టించి నగదు స్వాహా చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్‌ఎంఎస్‌లపై ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
1930 కి ఫిర్యాదు చేయవచ్చు
సాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్‌డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లు లేదా అధికారిక మొబైల్ యాప్ ల ద్వారానే చేయాలి. తెలియని వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా వచ్చే లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్‌డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్‌ఎంఎస్‌లు వస్తే నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ
అధికారి ఎంవీ.ప్రసాద్
నరసరావుపేట: యుద్ధ పరిస్థితుల వల్ల జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ.ప్రసాదు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఆయిల్ నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. వినియోగదారులు తమ వాహనాలకు అవసరాల మేరకే పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయాలని, వేసవిలో ఫుల్‌ట్యాంకు చేయించటం వల్ల పేలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎక్కడైనా పెట్రోలు, డీజిల్ లేకపోయినా, ఎల్‌పీజీ సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నా సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు తెలియచేయాలని కోరారు.
గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్,
గ్యాస్ బుకింగ్ పేరిట ఎరవేసే ప్రమాదం
వాట్సాప్, ఎస్‌ఎంఎస్ లింకుల
పరిశీలన అవసరం
ప్రజలు అప్రమత్తంగా
ఉండాలంటున్న పోలీసులు
గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరం.
నేరగాళ్లు పంపించే యాప్ డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ డేటా అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్‌కు వచ్చే బ్యాంకు ఓటీపీలు, రహస్య సందేశాలు నేరు గా వారి చేతుల్లోకి వెళ్లి పోతాయి. ఖాతా లో డబ్బులు ఖాళీ అవుతాయి.
వినియోగదారుల అవసరాలను నేరగాళ్లు ఆసరాగా చేసుకుని గ్యాస్ బుక్ చేసుకుంటే వెంటనే డెలివరీ చేస్తామని నకిలీ లింకులు, బుకింగ్ పోర్టల్ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
ముందస్తు చెల్లింపుల కోసం ఓటీపీ అడుగుతారు. ఎట్టి పరిస్థితిల్లో తెలి యని లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దు. వారు పంపించే అనుమానాస్పద ఏపీకే లింకులనుఓపెన్ చేయకపోవడం శ్రేయస్కరం.


