● చిలుకా జయపాల్ మాట్లాడుతూ దళిత మహిళను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించిన జనసేన నాయ కుడు రంగిశెట్టి సుమన్‌ను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కోడిరెక్క దేవదాసు మాట్లాడుతూ దళిత మహిళ స్వాతికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ తరఫున పోరాడుతామని పేర్కొన్నారు.
● బాధిత దళిత మహిళ కొణతం స్వాతి మాట్లాడుతూ జనసేన మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ కులం పేరుతో దూషించటమే కాక అసభ్య పదజాలంతో పోస్ట్ పెట్టాడన్నారు. దీని పై పోలీస్టేషన్‌లో కేసు పెడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఈవ్‌టీజింగ్ కింద కేసు పెట్టి పోలీసులు, టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవరిస్తున్నారన్నారు.
● పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలుపుతున్న నాయకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి 19 మందికి 41 నోటీసులు ఇచ్చారు.
● కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చలంచర్ల లక్ష్మితులసిసాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్.మౌలాలి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చావా.రమేష్ ,బోదాటి సీతారాములు, గుజ్జర్లపూడి కృపావరం, ఎస్సీ సెల్ పల్నాడు జిల్లా యూత్ సెక్రెటరీ యాసారపు బాబు, పట్టణ యువ జన విభాగం అధ్యక్షుడు డానియల్, మాజీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి సతీష్, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జలీల్, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఘోర, జంగాల సంపత్, కాశిమాల ఓబయ్య, గుజ్జర్లపూడి నిరంజన్ ప్రకాష్ ఉన్నారు.
జనసేన మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్‌ను కఠినంగా శిక్షించాలి
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలుకా జయపాల్
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన, అమరావతి బస్టాప్ వద్ద ధర్నా
వైఎస్సార్ సీపీ నాయకులు
19 మందికి పోలీసుల నోటీస్
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ కో–ఆప్షన్ మెంబర్, దళిత మహిళ కొణతం స్వాతిని కులం పేరుతో దూషించి సామాజిక మాధ్యమ వేదికగా బూతుపదజాలంతో పోస్ట్ చేసి అవమాన పరిచిన జనసేన మాజీ మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలుకా జయపాల్ డిమాండ్ చేశారు. సుమన్‌కుమార్‌ను శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అమరావతి బస్ పాయింట్ సెంటర్‌లో భైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు.