ఆటోను ఢీకొన్న టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న టిప్పర్‌

Mar 28 2026 7:45 AM | Updated on Mar 28 2026 7:45 AM

ఆటోను ఢీకొన్న టిప్పర్‌ ఆరుగురికి తీవ్ర గాయాలు నరసరావుపేట టౌన్‌: టిప్పర్‌ లారీ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ దాసు, పొనపాటి బాబురావు, కనుమూరి రామయ్య, బాల హరికృష్ణారెడ్డి, నూరుబాష, చిలక హరీష్‌లు నరసరావుపేటలో పని చూసుకొని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలోని మల్లమ్మ సెంటర్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొంది. సంఘటనలో ఆటో డ్రైవర్‌ దాసుతోపాటు ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ శుక్రవారం తెలిపారు.

గురుకుల పాఠశాలలు,

కళాశాలల్లో ప్రవేశాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకై ఏప్రిల్‌ 24న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 7వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సంస్థ గుంటూరుజిల్లా కన్వీనర్‌ ఎం.రజిని శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఉర్దూ బాలుర గురుకుల పాఠశాలతోపాటు, సంగడిగుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకై విద్యార్థులు ఏపీఆర్‌ఈఐఎస్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. నందివెలుగురోడ్డులోని గురుకుల ఉర్దూ బాలుర జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement