11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు.
తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళ్ళిపాళ్ల పవన్‌కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు


