దేవుడిలా ప్రాణం పోసిన వైఎస్ జగన్
ఈ రోజు నా భర్త ఇలా ఉన్నారంటే ఆయన చలవే చనిపోయాడని వైద్యులు ఇంటికి తీసుకెళ్లమన్నారు దేవుడిలా అండగా నిలిచిన ఆనాటి సీఎం జగన్ కరోనా కాలంలో అన్నివిధాలా అండగా వైఎస్సార్‌సీపీ సర్కార్ రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టి మరీ వైద్య చికిత్సలు జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం గుంటూరు జీజీహెచ్ రేడియాలజిస్టు డాక్టర్ భాగ్యలక్ష్మి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సమాజంలో వైద్యులను దేవుడితో సమానంగా ప్రజలు చూస్తారు. అలాంటి వైద్యుడికి ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయన ప్రాణాలు కాపాడారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ‘‘కరోనా రోజుల్లో నా భర్త నర్తు భాస్కరరావు అప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్. నేను గుంటూరు జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నాను. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ 2021 ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డాం. కొద్దిరోజుల్లోనే కోలుకున్నా. నా భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంతోమంది మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మానవత్వంతో సహాయం చేశారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. కష్టాలు పడుతూనే వైద్యం అందించాం. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, మారిస్తేగానీ బతకరని తెలియడంతో చైన్నె తీసుకువెళ్లాలంటే ఎయిర్ లిఫ్టింగ్‌కే రూ. 26 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ కిమ్స్‌కు తీసుకువెళ్లాం. అక్కడ ఎక్మో దొరకడం ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. బ్రెయిన్‌డెడ్ అని నిర్ధారించి ఇంటికి తీసుకెళ్లమన్నారు. వైద్యురాలిగా బతికించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బతిమాలడంతో మరిన్ని పరీక్షలు చేసి మెదడు పని చేస్తుందని గుర్తించారు. హైదరాబాద్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. 40 రోజులు ఎక్మో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. జూన్ 4న ఆసుపత్రిలో చేరాం. జూలై 14న ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఊపిరితిత్తులు డోనర్ దొరకడానికి జాప్యం జరగడంతో 40 రోజులు ఎదురుచూశాం. ఆపరేషన్ సుమారు పది గంటలకు పైగా పట్టింది. మొత్తం ఖర్చు రూ. 1.17 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే మంజూరు చేసింది.
వంద రోజులకుపైగా బెడ్‌పైనే
ఆపరేషన్ అనంతరం వంద రోజులకుపైగా బెడ్‌పై ఉంచారు. నరాలు చచ్చుపడిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రతి పని నేర్పించాను. ఊపిరితిత్తులు నూతనంగా అమర్చడంతో ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో డాక్టర్ భాస్కరరావు, నేను క్లాస్‌మేట్స్. 2001లో ఎంబీబీఎస్ అభ్యసించాం. ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం మాకు ఊపిరిగా మారింది. ’’


