మారిన ఊరు రూపురేఖలు
నాడు ఎవరైనా అనారోగ్యం పాలైతే ఎడ్లబండి కట్టాల్సిందే బడికి వెళ్లాలంటే 10 కిలో మీటర్లు నడక కష్టాలు జగనన్న పాలనతో అలాంటి ఊరే పట్టణంలా మార్పు అభివృద్ధి పనులతో ప్రజలకు సేవలన్నీ చేరువ
సత్తెనపల్లి: ‘‘ఇదిగో ఈ ఊరి నడిబొడ్డున అరుగు మీద కూర్చుని గ్రామాన్ని చూస్తుంటే జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామం. నా పేరు కళ్లం తిరుపతి రెడ్డి. 82 ఏళ్లు దాటాయి. భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. ముని మనవళ్లు కూడా వచ్చారు. అప్పట్లో ఎట్టా ఉండేది ఊరు?.. ఇప్పుడు ఎట్టా మారిందో! చదువులకు వెళ్లాలంటే 10 కిలో మీటర్లు నడిచేవారు. బురదలో భుజాన బ్యాగులు తగింలిచుకుని కాళ్లు ఈడుస్తూ సత్తెనపల్లి పోయేవారు. ఊళ్లో ఎవరికై నా రోగం వస్తే గుండెలు కొట్టుకునేవి. ఎడ్లబండి కట్టుకుని సత్తెనపల్లికి పరుగు పెట్టేవాళ్లం. మట్టిని నమ్ముకున్నోళ్లం. వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. నీళ్ల కోసం ఆశగా ఆకాశం వంక చూసి.. నాలుగు చినుకులు రాలితే దండం పెట్టుకునేవాళ్లం.
ఒక్కసారిగా పనులు
వైఎస్ జగన్ పాలనలో ఊళ్లో పరిస్థితులే మారిపోయాయి. నడిబొడ్డుకే అన్ని వచ్చి చేరాయి. మా మనవళ్లు, మనవరాళ్లు బ్యాగులు భుజాన తగిలించుకుని, బూట్లు వేసుకుని ఊరిలోనే బడికి వెళుతుంటే ఎంతో సంబరంగా ఉంది. ఎప్పుడు అవసరం వచ్చినా చిటికెలో విలేజ్ క్లినిక్ (ఆరోగ్య కేంద్రానికి) వెళుతున్నాం. పెద్ద డాక్టర్లను కూడా పల్లెటూళ్లకు తీసుకొచ్చారు. అంతకంటే ఏం కావాలి మాకు. వైఎస్ జగన్ పుణ్యమాని ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే సచివాలయ భవనం నిర్మించారు. పంటలకు సరిపడా నీళ్లు వస్తున్నాయి. కాలువలను నిండుతున్నాయి. అన్నదాతలను నెత్తిన పెట్టుకున్నారు జగన్. విత్తు నుంచి పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకునే వరకు ఊళ్లోకే రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చారు. వ్యవసాయాన్ని నిలబెట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారు. ఒక్క మా ఊరిలోనే రూ. 13 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేయించారు. దీంతో పల్లె కాస్త పట్టణంలా మారిపోయింది. అందుకే వైఎస్ జగన్ పది కాలాలపాటు బంగారంలా ఉండాలని జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నా.’’
మారిన ఊరు రూపురేఖలు
మారిన ఊరు రూపురేఖలు
మారిన ఊరు రూపురేఖలు


