నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు | - | Sakshi
Sakshi News home page

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు

Dec 21 2025 9:26 AM | Updated on Dec 21 2025 9:26 AM

నేడు

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు

సత్తెనపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఐదేళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు 1,89,746 మంది ఉన్నారు. చుక్కల మందు వేయడానికి 1,151 బూత్‌లను ఏర్పాటు చేశారు. 26 ట్రాన్సిట్‌ పాయింట్లు, 87 మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట నలుగురు సిబ్బంది ఉంటారు. పారా మెడికిల్‌ సిబ్బందితో పాటు అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 100 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల సమన్వయంతో మూడు రోజులపాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలియో బూత్‌ల ద్వారా చుక్కల మందు వేసిన సిబ్బంది ఆ బిడ్డల చేతి గోరుపై సిరా గుర్తు పెడతారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మంగళ, బుధవారాల్లో ఇంటింటికి

అవగాహన ర్యాలీ

నరసరావుపేట: ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో సందర్భంగా శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్‌పోలియో అవగాహనా ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ రాంబాబు, డీఎల్‌టీఓ డాక్టర్‌ మాధవీలత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఎఫ్‌డీపీ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.హనుమకుమార్‌, డీఎంఓ డాక్టర్‌ షేక్‌ నజీర్‌, డీపీఓ ఉన్నూరు బాష, ఎస్‌ఓ నీలకంఠేశ్వరరావు పాల్గొన్నారు. తిరుగుతూ చుక్కల మందు వేస్తారు.

పరిసరాల పరిశుభ్రత అందరి నైతిక బాధ్యత

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: స్వచ్ఛత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. శనివారం నరసరావుపేటలోని గాంధీపార్కు వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ రీసైక్లింగ్‌ విధానంలో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి నెల మూడవ శనివారం ఒక ముఖ్యమైన అంశంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయం నుంచి గాంధీపార్కు వరకు ఉద్యోగులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జస్వంతరావు, డీఇ రఫీక్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి కె.సాంబయ్య, రెవెన్యూ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కోటయ్య, రమాదేవి పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్‌పర్సన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. సీనియర్‌ పాస్టర్లు క్రీస్తు సందేశం వినిపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీస్తు అవలంబించిన జాలి, దయ, కరుణ, క్షమ అందరికీ అనుసరణీయమన్నారు. క్రైస్తవులకు కళ్యాణమండపం, వేడుకలకు స్థలం కేటాయింపుపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. భిన్న మతాలు, కులాలు ఉన్న దేశంలో సర్వమత సామరస్యం అవసరమన్నారు.

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు 1
1/2

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు 2
2/2

నేడు చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement