వైఎస్ కుటుంబం చలవతోనే వైద్య విద్య
నా పేరు షేక్ ఖాదర్ అఫ్రిది. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామం. తండ్రి షేక్ సుభాని రోజు వారి కూలీగా పనిచేస్తారు. అమ్మ హుస్సేన్‌బీ గృహిణి. సోదరికి వివాహమైంది. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన నేను ఉన్నత చదువులతో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కన్నా. ఆ కలలు నిజం కావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంతో తోడ్పడింది. నీట్‌లో 4,700 ర్యాంక్ సాధించిన నాకు ముస్లింలకు వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ వలనే శ్రీకాకుళం రిమ్స్‌లో 2019లో కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు, హాస్టల్ ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. సంవత్సరానికి రూ.45 వేల వరకు ప్రభుత్వం అందజేసింది. వైద్య విద్య చదివేందుకు తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడలేదు. ప్రస్తుతం రిమ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఎస్ కుటుంబ సహకారం మరువలేనిది. నాలాంటి ఎంతో మంది నిరుపేదలకు డాక్టర్ కలను సాకారం చేసిన వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ఆయన వందేళ్లు చల్లగా బతకాలి.
– షేక్ ఖాదర్ అఫ్రిది,
చినతురకపాలెం గ్రామం, నరసరావుపేట మండలం


