నెరవేరిన సొంతింటి కల
అద్దె ఇంట్లో ఉంటున్నామనేగానీ ఎప్పుడూ ఏదో వెలితి. పిల్లల కోసమైనా సొంత గూడు ఏర్పాటు చేసుకోలేకపోయామనే బాధ వెంటాడుతూ ఉండేది. కాయకష్టం చేసిన డబ్బులు ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు, పిల్లల చదువులకే సరిపోయేవి కాదు. సొంతింటి ఆలోచన వస్తే దుఃఖం పొంగుకొచ్చేది. ఆ సమయంలో దేవుడిలా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మా మొర ఆలకించారు. మా ఇంటికే వలంటీరును పంపించి సెంటున్నరకు నా పేరుతో పట్టా కాగితమిచ్చారు. పట్టా అందుకున్నాక ఆ ఆనందానికి అవధుల్లేవు. ఇల్లు కట్టేందుకు కూడా రూ.1.50 లక్షలు ఇచ్చి, 50 సిమెంట్ బస్తాలు, నాలుగు ట్రాక్టర్ల ఇసుక, ఇనుము పంపించారు. భర్త కృష్ణారెడ్డి, పిల్లలు లహరి, లాస్య ఇంటిల్లిపాదీ కష్టం చేసుకున్నాం. ఇటుక ఇటుక పేరుస్తుంటే.. గుండెల్లో పొంగిన ఆనందం అంతా ఇంతా కాదు. మా చేతి డబ్బులు రూ.60 వేలు ఖర్చు చేశాం. ఇప్పుడు సొంతింట్లో దర్జాగా బతుకుతున్నాం. ఆ కల నెరవేర్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి హృదయపూర్వక ఽజన్మదిన శుభాకాంక్షలు.
– గాయం సుధారాణి, కొమెరపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం


