పరిహారం .. పరిహాసం
మోంథా తుపానుకు జిల్లాలో 1,730.25 హెక్లార్లలో పంట నష్టం 33 శాతం కన్నా ఎక్కువగా నష్టపోతే పరిహారం అందజేస్తామన్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నష్టం నివేదిక తయారు చేసిన అధికారులు 3,377 మంది రైతులు నష్టపోయినట్లుగా గుర్తింపు నెలలు గుడుస్తున్నా అందని ప్రభుత్వ సాయం ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
సత్తెనపల్లి: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోంథా తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ప్రకటించి నేటికీ పరిహారం అందజేయక పోవడం పై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ సాగు ఖర్చులకు దోహదపడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
– గత రెండు నెలల క్రితం మోంథా తుఫాన్ దాటికి జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
జిల్లా వ్యాప్తంగా 1730.25 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు సర్వే చేసి అధికారులు లెక్కలు కట్టారు. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి పంటల నష్టాన్ని గుర్తించారు.
రైతు కంట కన్నీరు...
ప్రభుత్వం నుంచి స్పందన కరువు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ. 20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. అర్హులైన కొంత మంది రైతులకు ఇంతవరకు ఖాతా లకు నగదు జమకాలేదు. ఎందుకు అన్నదాత సుఖీభవ పథకం ఖాతాకు జమ కాలేదని స్టేటస్ అడిగితే చెప్పేవారే కరువ య్యారని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలో సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు సర్కారు వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుఫాన్‌తో నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందజేయాలని రైతుల కోరుతున్నారు.
జిల్లాలో మోంథా తుఫాన్ నష్టం(హెక్లార్లలో)
పంట విస్తీర్ణం
పత్తి 1,564.80
వరి 114.75
మొక్కజొన్న 28.99
కంది 05.42
మినుము 16.29
మొత్తం 1,730.25


