పాలిటెక్నిక్ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం
గుంటూరుఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు.
పాలిటెక్నిక్ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం


