ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

Dec 21 2025 9:26 AM | Updated on Dec 21 2025 9:26 AM

ఏపీ స

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి ఐదు స్క్రబ్‌ టైఫస్‌ కేసులు దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు

తాడికొండ: రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులు, సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య సెమీక్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్‌ కమిషనర్‌ ఏ.భార్గవతేజ్‌, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ వల్లభనేని శ్రీనివాసరావు, సీఆర్డీయే పీజీఎంసీ పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొనగా కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్‌ కరోల్స్‌, కేక్‌ కటింగ్‌, క్రిస్మస్‌ పాటల ఆలాపన నిర్వహించారు. అనంతరం క్రిస్మస్‌ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలకు సంబంధించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈగల్‌ టీమ్‌ చీఫ్‌ రవికృష్ణ

మంగళగిరిటౌన్‌: విద్యార్ధులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఈగల్‌ చీఫ్‌ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న నిర్మల హైస్కూల్‌ (సీబీఎస్‌ఈ)లో శనివారం స్పోర్ట్స్‌–ఓ–మేనియా క్రీడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవికృష్ణ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరిలో మంచి ప్రతిభ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో తప్పుదారి పట్టకుండా ఎప్పటికప్పుడు పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. అనంతరం చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మత్తుపదార్థాల నిర్మూలనపై పోస్టర్లను ఆవిష్కరించారు. స్కూల్‌ యాజమాన్యం ఆకె రవికృష్ణను సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌ రవినాయుడు, పాఠశాల యాజమాన్యం రెవ.సిస్టర్‌ డాక్టర్‌ షోవ్రిలు, మేరి ఫ్రాన్సిస్‌, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తెనాలిఅర్బన్‌: తెనాలి రెవెన్యూ డివిజన్‌ను స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి వణికిస్తుంది. ప్రతి రోజు తెనాలి జిల్లా వైద్యశాలకు ఐదు నుంచి 10 మందికి అనుమానితులు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 26 మంది చికిత్స పొందారు. శనివారం నూతనంగా ఐదుగురుకి నిర్ధారణ అయినట్లు సీనియర్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం 10 మంది జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, గోసంరక్షణకు భక్తులు విరివిగా విరాళాలు అందించారు. విజయవాడ మధురానగర్‌కు చెందిన డి.శ్రీనివాస ప్రసాద్‌ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయ్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం

అమ్మవారి అన్నప్రసాద వితరణకు చైన్నెకు చెందిన ఎం.బాబ్జి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విజయవాడ ఇస్లాంపేటకు చెందిన కె.వి.మోహనరావు దంపతులు దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ.1,00,005 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు 
1
1/2

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు 
2
2/2

ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement