తాడిపత్రి జ్ఞానమ్మ సేవలు ఎనలేనివి
కార్డినల్ పూల అంథోని(అగ్రపీఠాధిపతి, హైదరాబాద్) జ్ఞానమ్మ మ్యూజియం ప్రారంభం
ఫిరంగిపురం: దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ బాలికలకు చేసిన సేవలు ఎనలేనివని కార్డినల్ పూల అంథోని(అగ్రపీఠాధిపతి, హైదరాబాద్) అన్నారు. ఫిరంగిపురంలోని బాల ఏసు దేవాలయ ప్రాంగణంలో సెయింట్ ఆన్స్ సంస్థ స్థాపకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ 150వ వర్థంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఆమె జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని కార్డినల్ పూల అంథోని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య మాట్లాడుతూ దైవంపై విశ్వాసంతో జ్ఞానమ్మ జీవించారని చెప్పారు. అదేవిశ్వాసంతో బాలికలకు సేవ చేయాలనే తలంపుతో సేవా సంస్థను స్థాపించి సేవలు అందించారన్నారు. సెయింట్ ఆన్స్ సంస్థల మదర్ జనరల్ పైరెడ్డి అంతోనమ్మ మాట్లాడుతూ ఏ లక్ష్యాలతో తాడిపత్రి జ్ఞానమ్మ సంస్థను స్థాపించారో అదే లక్ష్యాలతో సంస్థను ముందుకు నడిపిస్తామన్నారు. పలుప్రాంతాల నుంచి వచ్చిన మేత్రానులు, మేత్రాసన గురువులు, గురువుల ఆధ్వర్యంలో దివ్యపూజాబలి నిర్వహించారు. జూబిలి స్మారక గ్రంథాన్ని ఆవిష్కరించారు. పలు సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జ్ఞానమ్మ డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కార్యక్రమంలో సంస్థకు చెందిన పలు ప్రాంతాల నుంచి వచ్చిన మఠకన్యా సీ్త్రలు, పూర్వవిద్యార్థులు, కథోళిక క్రైస్తవులు పాల్గొన్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న యువ–2025 శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే అని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలతో యువతకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందకు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు అవసరమని స్పష్టం చేశారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగనుందరి వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం ప్రతిభ కనబర్చిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.
తాడిపత్రి జ్ఞానమ్మ సేవలు ఎనలేనివి


