బీచ్ వాలీబాల్ పోటీల విజేత పశ్చిమ గోదావరి జట్టు
బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంకలో జరిగిన రాష్ట్రస్థాయి 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 బీచ్ వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు మొదటిస్థానంలో నిలిచింది. శుక్ర, శనివారాలలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదటి స్థానంలో పశ్చిమగోదావరి, ద్వితీయ స్థానంలో కృష్ణా, తృతీయస్థానంలో విజయనగరం, నాలుగో స్థానంలో నెల్లూరు జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో మొదటి స్థానం కడప, రెండో స్థానం తూర్పుగోదావరి, తృతీయ గుంటూరు, నాలుగో స్థానం విజయనగరం, అండర్ 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో విజయనగరం, రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో కర్నూల్, నాలుగు శ్రీకాకుళం, బాలికల విభాగం అండర్–14లో మొదటి స్థానంలో గుంటూరు, రెండో స్థానంలో తూర్పుగోదావరి, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాలుగో స్థానంలో కడప, అండర్–19 విభాగం బాలురలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమగోదావరి, మూడో విభాగం విజయనగరం, నాలుగో స్థానంలో కృష్ణా, 19 బాలికల విభాగంలో మొదటి స్థానంలో కృష్ణా, రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో చిత్తూరు, నాలుగోస్థానంలో కర్నూల్ విద్యార్థులు నిలిచారు. పోటీల విజేతలను జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు యు.వి.సుధారాణి, గుంటూరు జిల్లా స్కూలుగేమ్స్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, స్టేట్ అడ్జ్వజర్లు రజనినాయక్, శిరీష, పీడీలు పాల్గొన్నారు.


