రెండు గ్రామాలను దత్తత తీసుకున్న యూనియన్ బ్యాంక్
నరసరావుపేట రూరల్: యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ తిలక్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసరావుపేట రీజియన్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాలపాడు, దొండపాడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో బ్యాంక్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంక్ మేనేజర్ తిలక్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పథకాలను బ్యాంక్ ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు బ్యాంక్ రుణాలు అందజేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శివరాజ్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


