జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం
పర్చూరు(చినగంజాం): మండలంలోని ఉప్పుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల నిషి జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా గురువారం బాపట్ల జిల్లా స్థాయిలో ‘డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన వేగవంతమైన పరిష్కారం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కందుల నిషి సత్తా చాటినట్లు జిల్లా సైన్సు అధికారి సాధిక్ ప్రకటించారు. ఈ నెల 23న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. విజేతగా నిలిచిన నిషిని పాఠశాల హెచ్‌ఎం వసుంధరాదేవి, పర్చూరు మండల విద్యాశాఖాధికారులు శివ కోటేశ్వరరావు, ఎం. వెంకటరామయ్య, స్థానిక హోమియో వైద్యులు చంద్రశేఖర్, ఉపాధ్యా యులు రామకోటిరెడ్డి, వెంకటస్వామి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ అభినందించారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.3,21,22,542 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రి పై మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు జరిగింది. బుధవారం జరిగిన కానుకల లెక్కింపులో రూ.1,27,90,645 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి విదితమే. రెండు రోజుల్లో రూ.4,49,13,187 నగదు, 218 గ్రా ముల బంగారం, 17.324 కిలోల వెండి సమకూరింది. 190 యూఎస్‌ఏ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 15 యూఏఈ దిర్హమ్స్, 23 మలేరియా రింగట్స్, 101ఖత్తర్ రియాన్స్, 100.5 ఓమన్ బైంసాలు లభించాయి. కానుక ల లెక్కింపును ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించగా, దేవస్థాన, సేవా సిబ్బంది పాల్గొన్నారు.
మచిలీపట్నం–ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు మచిలీపట్నం– ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక వన్ వే రైలు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. ఈనెల 22న సాయంత్రం 4.20 గంటలకు మచిలీ పట్నంలో బయలుదేరి, 24వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుతుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, పెద్దపల్లి, మాచర్ల, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బినా, వీరంగన లక్ష్మీభాయ్ జంక్షన్, ఒరై, గోవింద్‌పురి స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.
విజయవాడ–కాచిగూడ ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి మీదగా ప్రయాణిస్తుంది.
జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం


