ఒకరి పరిస్థితి విషమం
సంతమాగులూరు(అద్దంకి): కారు బైకు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. అందులో ఒకరి పిరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు–గుంటూరు రహదారిలోని కామేపల్లి వద్ద గురువారం రాత్రి జరిగింది. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన రామకృష్ణ, దావీదులు బైకుపై మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పుట్టావారిపాలెం(అడ్డరోడ్డు)కు వచ్చారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి పనులు ముగించుకుని తిరిగి బైకుపై స్వగ్రామానికి పయనం అయ్యారు. ఈ క్రమంలో వారి బైకు, కారు కామేపల్లి సమీపంలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వాహనంలో క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై పట్టాభిరామయ్య అక్కడకు చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేస్నున్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో వెంకటప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. హౌసింగ్‌బోర్డు కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన దొంత ప్రవీణ్‌కుమార్ అనే యువకుడు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తన చెడు వ్యసనాల కోసం గోవా, విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్‌ఐ రెహమాన్, సిబ్బంది మోహన్, నూరూద్దీన్, రామారావులను జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ అభినందించినట్లు తెలిపారు.
విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, ఇతర సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడారు.
ఒకరి పరిస్థితి విషమం


