13వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా జీవీఎస్ ప్రసాద్
నరసరావుపేట టౌన్: 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏపీపీగా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది జీవీఎస్ ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నరసరావుపేటకు చెందిన ప్రసాద్ 1993–96 సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1997లో న్యాయవాదిగా నమోదై సీనియర్ న్యాయవాది సీహెచ్‌ఎల్ కాంతారావు వద్ద కొంతకాలం జూనియర్‌గా పనిచేశారు. జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు.
అరవిందబాబుకు షాక్..
అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిని నియమించాలని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పట్టుబట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సదరు న్యాయవాదిని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబును పలుమార్లు కలిశారు. సిఫారసు లేఖను సైతం అందజేశారు. బహిరంగ విలేకరుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వం జనసేనకు చెందిన ప్రసాద్‌ను ఏపీపీగా నియమించటం ఎమ్మెల్యే వర్గాన్ని షాక్ గురిచేసింది.


